బూదగవి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

బూదగవి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బూదగవిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రకాష్ స్వామి ఆధ్వర్యంలో సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున మూలవిరాట్‌కు అభిషేకం, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు, మహామంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించారు.

అదేవిధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు బసవరాజు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చత్రగుడి చిరంజీవి, కమిటీ సభ్యులు మహేంద్ర గౌడ్, చత్రగుడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.