భూపాలపల్లిలో టీఆర్ఎస్ జెండా పండుగ
భూపాలపల్లిలో టీఆర్ఎస్ జెండా పండుగ
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆదివారం జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి నరేష్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అబ్జర్వర్ మేడల అభిలాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘పంచజన్యం’ హామీలను ప్రజలకు వివరించారు.
ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై పార్టీ కట్టుబాటును వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అబ్జర్వర్ వల్లకొండ అజయ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సిద్ధిక్ షేక్, బుర్ర వినోద్, గోవర్ధన్, సంతోష్, ఉద్యమ నాయకురాళ్లు భారతమ్మ, పద్మలత, యువ నాయకులు, విద్యార్థి నాయకులు, హెచ్‌ఎంఎస్ యూనియన్ నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
