క్యాతనపల్లిలో 7 రోజుల ఉపవాస దీక్ష ముగింపు

క్యాతనపల్లిలో 7 రోజుల ఉపవాస దీక్ష ముగింపు

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ:

క్యాతనపల్లి మున్సిపాలిటీ 15వ వార్డులోని గ్లోరియస్ చర్చిలో ఏడు రోజులుగా జరిగిన ఉపవాస దీక్ష ప్రార్థనలు ఆదివారం ముగిశాయి. ముగింపు ప్రార్థన కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డా. రాజా రమేష్, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ డా. సంధ్యా రాణి హాజరై దేవుని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏ పని చేసినా దేవుని ఆజ్ఞ లేనిదే జరగదన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లోబి ఆర్, ఎస్ ,సి, పి, ఐ పార్టీల కలయిక గెలవడం ప్రజల ఆశీర్వాదమే అని, ప్రజలే న్యాయనిర్ణేతలని అన్నారు. మనం చేసే పనుల వల్ల ఇతరులకు నష్టం, ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జీవితంలో కష్టాలు, సుఖాలు, లాభ-నష్టాలు వస్తూనే ఉంటాయని, వాటిని దేవునిపై నమ్మకంతో సహనంగా స్వీకరించి ముందుకు సాగాలని భక్తులకు సూచించారు.

7 రోజులు ఉపవాసం ఉన్న భక్తులు తలపెట్టిన పనులు, కోరికలు యేసుక్రీస్తు ప్రభువు తీర్చాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ ఆర్నె సంధ్య రాణి-సతీష్, బి ఆర్ ఎస్ నాయకులు టైలర్ రాజు, సుధాకర్,అమ్మక్క,యువ నాయకులురామిడి లక్ష్మీకాంత్,మణి కుమార్, చర్చ్ పాస్టర్ రమేష్, సభ్యులునవీన్,పాల్గొన్నారు.