పోరాట దృక్పథంతో మరో పోరాటని సిద్ధ కావాలి

పోరాట దృక్పథంతో మరో పోరాటని సిద్ధ కావాలి

నర్సంపేటలో మేడే సంబరాలు

నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో పోరాట దృక్పథంతో మరోసారి పోరాటానికి సిద్ధంగా వలసిన సమయం ఆసన్నమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగిన మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడు తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పాపిస్టు ప్రభుత్వమని కార్మిక హక్కుల సాధించిన తర్వాత కార్మికులకు రక్షణ లేకుండా కార్మికులకు రక్షణ కల్పించిన కార్మిక చట్టాలను అణిచివేయా లని చూస్తుందని ఆరోపించాడు. నాలుగు లేబర్ కోడ్ రూపంలో తీసుకువచ్చి రాష్ట్రాలలో అమలు చేయాలని చెప్పిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాలుగు లేబర్ కోర్ల అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

దాన్ని పూర్తిగా వ్యతి రేకిచ్చిన కార్మిక సంఘం బిఆర్టియు కెసిఆర్ నాయకత్వంలో ఉన్న కార్మిక వర్గాలకు బిఆర్టియు ఎంత బలోపేతం అయితే నాలుగు లేబర్ కోడ్లను అంత బలంగా ఎదిరించవచ్చనీ పేర్కొన్నారు.ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ అనుబంధ సంస్థగా బిఆర్టియు ఉందని తెలిపారు. రాష్ట్రంలో కార్మిక హక్కులను కాపాడుకోవడంలో కార్మికులను రక్షించడంలో, బిఆర్ఎస్ ,బి ఆర్ టి యు మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్, బి ఆర్టియు అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నల్ల భారతి, జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్, కౌన్సిలర్లు శివరాత్రి స్వామి, మనోహర్ రెడ్డి, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, మండల శ్రీనివాస్, గంగిడి సాంబా రెడ్డి, శాంతి కుమార్, తిరుపతి రెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, కార్మికులు , పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.