నాటిన మొక్కను సంరక్షించాలి: బీజేపీ నేతల పిలుపు

నాటిన మొక్కను సంరక్షించాలి: బీజేపీ నేతల పిలుపు

తొర్రూరు, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు పైండ్ల రాజేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 21 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో “అమ్మ పేరిట మొక్క” కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పైండ్ల రాజేష్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడం కూడా అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ పల్లె కుమార్, మండల ప్రధాన కార్యదర్శి నడిగడ్డ సందీప్, జిల్లా నాయకులు అలిసేరి రవిబాబు, గంధం రాజు, తూర్పాటి సాయి ముఖేష్, జలగం రవీందర్, విజయ్‌కుమార్, బీజేవైఎం నాయకులు నూకల నవీన్, తూర్పాటి మోహిత్, సురేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.