Ap-Russia | మాస్కో తరహా స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థపై లోకేష్ ఫోకస్
ఆంధ్రప్రభ: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్‌తో కీలక సమావేశం నిర్వహించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆధునిక రవాణా వ్యవస్థలు, స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో మాస్కో తరహా ఏఐ ఆధారిత ట్రాన్సిట్ ట్రాకింగ్ వ్యవస్థ, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అమలుకు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. రవాణా రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.
