ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామసభలు..
వర్ని, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనగర్ గ్రామ సర్పంచ్ పూర్ణిమ కిరణ్ సూచించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామసభలు వేదికగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు.
గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కృష్ణవేణి కోరారు. ముందస్తు నిర్ధారణ ద్వారా అనేక వ్యాధులను నియంత్రించవచ్చని ఆమె వివరించారు. ఈ సమావేశంలో ఎంపీవో మారుతి, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి వేణుగౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
