అటవీశాఖలో ఘనంగా వన మహోత్సవం..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : వాతా వరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి,వాటిని సంరక్షించాలని ఎఫ్ఆర్ వో అనిత, గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అన్నారు.బుధవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని అటవీశాఖ ఆద్వర్యంలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీగిరి క్షేత్రం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్,ఎఫ్ బివో వరుణ్,విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్,పంచాయతీ కార్యదర్శి వినోద్,వేముల గంగారెడ్డి,ముద్రవేణి హన్మాండ్లు,సుంకరి మురళి,రాకేష్ అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
