ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బీహార్లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, వారి బంధువులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరుకు ముగ్గురు రోగులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరికి గాయాలు కాగా అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
