అందుకే.. 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం – ఏసిపి కిరణ్ కుమార్

అందుకే.. 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం – ఏసిపి కిరణ్ కుమార్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆర్కేపీ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన కెమెరాల పని తీరును పరిశీలించారు. పట్టణంలోని పలు కాలనీలు, కూడళ్లలో ఈ కెమెరాలను అమర్చినట్లు ఆయన వివరించారు.

కెమెరాల వల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి, సాక్ష్యాలు సేకరించడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పట్టణ ప్రజలకు సూచించారు. పోలీసు-ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణంలో శాంతిభద్రతలను కాపాడుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి డీఎస్పీ పరస రమేష్, ఆర్కేపీ పట్టణ ఎస్ఐ జాడీ శ్రీధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply