చిన్నారుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

చిన్నారుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ప్రతిభ హైస్కూల్లో జరుగుతున్న నృత్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిన్నారులు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ప్రతిభ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గాదె సోమిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులంతా ఈ సందర్భంగా తెలంగాణ ప్రాధాన్యతను తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.