అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల నిఘా

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల నిఘా
బెజ్జంకి, ఆంధ్రప్రభ:
అక్రమ ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోందని, అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని ఎస్సై తోట తిరుపతి హెచ్చరించారు.
బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చుక్క సామికృత్ అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
బడా దోస్త్ వాహనంలో ఇసుకను రవాణా చేస్తుండగా అతడిని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించలేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
