KCR | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు : కేసీఆర్

KCR | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆయన స్మరించుకుంటూ.. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కేసీఆర్ నివాళులర్పించారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజల జీవితాల్లో మరింత సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం, ఆ తర్వాత పదేళ్ల పాటు సాగిన ప్రగతిశీల పాలనతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణ ప్రజలందరికీ ఆయన మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply