రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
చిలుపూర్, ఆంధ్రప్రభ:
స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని అన్నపూర్ణ రైస్ మిల్లు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు జమ్మికుంటకు చెందిన రాజేష్ రెడ్డి (29)గా గుర్తించారు.
వివరాల ప్రకారం, రాజేష్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జమ్మికుంటలో బంధువు మరణించడంతో దహన సంస్కారాలకు హాజరై, తిరిగి హైదరాబాద్‌కు మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు.
తిరుగు ప్రయాణంలో స్టేషన్ ఘనపూర్ పరిధిలోని అన్నపూర్ణ రైస్ మిల్లు వద్దకు రాగానే, రాంగ్ రూట్లో నిలిపి ఉన్న లారీని మోటార్ సైకిల్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజేష్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

