మూడోసారి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కరంటోత్ శ్రీనివాస్ నాయక్

మూడోసారి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కరంటోత్ శ్రీనివాస్ నాయక్

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ:
సంస్థాన్ నారాయణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కరంటోత్ శ్రీనివాస్ నాయక్ మూడోసారి నియమితులయ్యారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా శ్రీనివాస్ నాయక్ నియామక పత్రాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా కరంటోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పబ్బు రాజు గౌడ్, వాంకుడోత్ బుజ్జి, సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, దోనూరు జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply