Peddi Movie | పెద్ది రిలీజ్ కు ముందు జాన్వీ మాటలు వైరల్‌

Peddi Movie | పెద్ది రిలీజ్ కు ముందు జాన్వీ మాటలు వైరల్‌

Peddi Movie | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణం అనేది అంతిమంగా ప్రేక్షకులకు చేసే ఒక ‘సేవ’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక సినిమాను నిజాయితీతో, మంచి ఉద్దేశంతో తీస్తే, అది ఖచ్చితంగా చేరాల్సిన ప్రజలకు చేరుతుందని జాన్వీ నమ్మకం వ్యక్తం చేశారు. “నా దృష్టిలో ప్రేక్షకులు దేవుళ్లతో సమానం. మేము వారికి వినోదాన్ని అందించే సేవకులం మాత్రమే” అని జాన్వీ పేర్కొన్నారు.

సోషల్ మీడియా విమర్శలపై స్పందన..
సినిమాలు చూడకుండానే సోషల్ మీడియాలో వాటిపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం, అనవసరమైన విమర్శలు గుప్పించడం వంటి సంస్కృతిపై ఆమె స్పందించారు. ప్రజలు తొందరపడి తీర్పులు ఇవ్వొచ్చని, కానీ ఆ అభిప్రాయాలను తాము స్వీకరిస్తామని ఆమె తెలిపారు. “ప్రజల అభిప్రాయాలు చాలా ముఖ్యమైనవి. అవి నటులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దోహదపడతాయి” అని జాన్వీ స్పష్టం చేశారు.

‘పెద్ది’పై భారీ అంచనాలు..
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.