గడప వద్దకే చేరిన భరోసా

తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం బైరాగిపట్టెడలో నిర్వహించారు. క్లస్టర్-4 ఇన్‌చార్జి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ, సచివాలయ అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును అందజేసినట్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా పొందుతున్నారని పేర్కొన్నారు.

ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లు అందడం వల్ల తమ జీవనోపాధికి తోడ్పాటు లభిస్తోందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని శ్రీధర్ వర్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పథకాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అన్నారు.

త్వరలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు కూడా పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని వెల్లడించారు.

కార్యక్రమంలో పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.