చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత

పెగడపల్లి, ఆంధ్రప్రభ: లోన్ యాప్ వేధింపుల కారణంగా మరో యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో విషాదాన్ని నింపింది.

మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి లిఖిత్ (21) అనే యువకుడు లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం రుణ వసూళ్ల పేరుతో వేధింపులు అధికం కావడంతో కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం లిఖిత్ మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

Leave a Reply