01-Cm-Cbn-Slams : ఇది దుర్మార్గంతో యుద్ధం Andhra Prabha Top News

01-Cm-Cbn-Slams : ఇది దుర్మార్గంతో యుద్ధం Andhra Prabha Top News
- చెడును గుర్తిద్దాం
- చెడును ఖండిద్దాం
- సానుభూతి కోసం.. తప్పుడు ఆరోపణలు
- గొడ్డళ్లు కాదు..కత్తులతో వచ్చినా. భయపడం
- ఇక్కడ ఉంది సీబీఎన్
- పక్కనే పవన్ కళ్యాణ్
- పైన నరేంద్ర మోదీ
- కూటమి సహించదు
- అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
- విశాఖ, అమరావతి, తిరుపతిల్లో… రీజియన్లు
- చామవరం పేదోళ్ల సేవలో సీఎం చంద్రబాబు
( ఆంధ్రప్రభ, తుని ప్రతినిధి)

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంతో పని చేస్తుంటే… రాష్ట్రంలో విధ్వంసాలకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోంది. విశాఖపట్‌నంలో కోడి కత్తి నుంచి విజయవాడలో గులకరాయి వరకూ సానుభూతి కోసం ప్రయత్నించిన ఈ గొడ్డలి పార్టీ తీరు మారలేదు. అన్నీ తప్పుడు ఆరోపణలతో విచ్చలవిడి రాజకీయాలు చేస్తోంది. అందుకే చెడును గుర్తించాలి. చెడును ఖండించాలి. లేకపోతే మన పరిస్థితి వైకుంఠపాళిగా మారిపోతుంది, అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తుని నియోజకవర్గం చామవరంలో సోమవారం పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదికపై ఆయర మాట్లాడుతూ, ఔను ప్రతిపక్ష పార్టీది గొడ్డలి పార్టీ అన్నాం.. ఒక నాయకుడు కూడా ఒప్పుకున్నాడు. గొడ్డళ్లతో, వేట కొడవళ్లతో వస్తాం, అన్నాడు. ఇదా రాజకీయం. విచ్చలవిడి తనం పనికి రాదు. ఇక్కడ ఉంది సీబీఎప్.. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ కూటమి, అసలు సహించం, అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశౄరు. తిరుపతిలో మద్యం బాటిల్ పెట్టింది సాక్షి విలేఖరి. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త. అప్రమత్తంగా ఉన్నాం కాబట్టే.. ఇలాంటి తప్పుడు పనులను కొన్ని గంటల్లోనే బయటపెట్టాం, అని సీఎం వివరించారు.
01-Cm-Cbn-Slams : విధ్వంసం నుంచి విముక్తి రోజు

చరిత్రలో జూన్ 4వ తేదీ నిలిచిపోయే రోజు. రాష్ట్రంలో విధ్వంస పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజ అది. కూటమిగా మీ అందరి మద్దతుతో అధికారం చేపట్టిన రోజు. గత పాలన అంతా విధ్వంసకర పాలనలో బహిరంగంగా నవ్వాలనుకున్నా ప్రజలంతా భయపడే పరిస్థితి. సమావేశాల నుంచి ప్రజలు వెళ్లి పోకుండా కందకాలు తవ్వి, ఫెన్సింగ్‌లు వేసి మరీ నిర్వహించే పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి పేదల కోసం పనిచేస్తున్నాం. దానికి నిదర్శనమే పింఛన్ల పెంపు. అని సీఎం స్పష్టం చేశారు.
01-Cm-Cbn-Slams : పేదలు లేని సమాజమే లక్ష్యం

పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని నేనూ ఎప్పుడూ భావిస్తాను. రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు ఉన్నా… తొలి నెల నుంచే పింఛన్లు పెంచి ఇచ్చాను. పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి రూ.4 వేలు చేశాం. దివ్యాంగులకు రూ.6,000 చేశాం. ఆరోగ్య పెన్షన్లు రూ.10 వేలకు, రూ.15 వేలకు పెంచాం. 2024 జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.65,887 కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించాం. ఏడాదికి దాదాపు రూ.32 వేల కోట్లు ఈ ఒక్క పథకానికే ఖర్చు పెడుతున్నాం. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో, ఇంత ఎక్కువ మందికి పింఛన్లు ఇవ్వడం లేదు. అని సీఎం చంద్రబాబు వివరించారు.
01-Cm-Cbn-Slams : బటన్ నొక్కితే పైశాచిక ఆనందం

బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలు తెలుసుకునే పరిస్థితి ఉండదు.
అందుకే ప్రతీ నెలా 1 తేదీన ప్రజలను నేరుగా కలుసుకుని పెన్షన్లు అందిస్తున్నాం ఈ నెలలో రాష్ట్రంలో 62.34 లక్షల మందికి, రూ.2,729 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నాం. ఒకటీ రెండు నెలల పాటు ఏ కారణం చేత అయినా పెన్షన్లు తీసుకోకపోయినా మూడో నెల అన్నీ కలిపి ఇస్తున్నాం
ఈనెల కొత్తగా మరో 5,606 మందికి రూ.2.24 కోట్లు స్పౌజ్ పెన్షన్ల కోసం మంజూరు చేశాం రాష్ట్రంలో చాలా మంది పేద కుటుంబాలకు 2 నుంచి 4 సంక్షేమ పథకాలు అందుతున్నాయి. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటోడ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో ఇలా వేర్వేరు సంక్షేమ అమలు చేస్తున్నాం, అని సీఎం సీబీఎన్ తెలిపారు
01-Cm-Cbn-Slams : రైల్వే జోన్ కల సాకారమైంది

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా చర్యలు చేపట్టాం. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటిద్వారా 23 లక్షల ఉద్యోగాలు కూడా మన యువతకు వస్తాయి.
మన రాష్ట్ర యువత ఎవరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు చేస్తున్నాం. కాకినాడ సమీపంలో గ్రీన్ అమ్మోనియో రూ.80 వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది తుని పక్కనే అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ ఓ స్టీల్ సిటీని ఏర్పాటు చేస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది . మన యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. పీఎం సేతు కింద యువతకు స్కిల్ డెవలప్ మెంట్ చేస్తున్నాం ఏడాదికి 25 వేల మంది యువతకు శిక్షణను పీఎం సేతు కింద ఇస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర సహకారంతో తిరిగి పునరుద్ధరించాం. అలాగే విశాఖ రైల్వే జోన్ కల కూడా సాకారమైంది, అని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
01-Cm-Cbn-Slams : పుష్కరాలకు ముందే…

2027 గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం
ఈ పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం ఎడమ కాలువను జూలైలోగా పూర్తి చేసి నీరు తీసుకెళ్తాం.
తీర ప్రాంతాల్లో పనిచేస్తోన్న మత్స్యకార మహిళలు, డ్వాక్రా మహిళలకు సీ వీడ్ ఉత్పత్తిచేసి అదనపు ఆదాయం వచ్చేలా చేస్తాం, తీర ప్రాంతాల్లో మత్స్యకారుల కోసం రూ.240 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్లను కూడా సబ్సీడిపై అందిస్తాం. అమినాబాద్ ఫిషింగ్ హార్బర్ కోసం రూ.80 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
01-Cm-Cbn-Slams : అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది.
శ్రీకాకుళం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి వరకూ విశాఖ రీజియన్‌గా పశ్చిమగోదావరి నుంచి ప్రకాశం వరకూ అమరావతి రీజియన్‌గా అభివృద్ధి చేస్తాం. తిరుపతి కేంద్రంగా రాయలసీమ రీజియన్‌ను అభివృద్ధి చేస్తున్నాం
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వచ్చింది. పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. మన ప్రాంతంలో పండుతున్న వాణిజ్య పంటలు ఆయా ప్రాంతాలకు ఎగుమతి కావటం లేదు. ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎల్ నినో కారణంగా ఎండలు తీవ్రంగా పెరిగాయి
వర్షపాతం కూడా తక్కువగా పడే అవకాశం ఉంది. కానీ సమర్ధ నీటి నిర్వహణతో రిజర్వాయర్లలో 65 శాతం నీళ్ళు ఉన్నాయి, ముందుగానే కాలువలకు నీళ్లు ఇవ్వగలిగాం. వచ్చే ఏడాదికి వెసులుబాటు కలగాలనే పంటలకు నీళ్లు ఇచ్చాం, అని సీఎం వివరించారు.
ALSO READ : https://prabhanews.com/may-31-success-story-palnadu-youth-from-factionism/
