Lyrics | అసలు వివాదం ఏమిటి?

Lyrics | అసలు వివాదం ఏమిటి?
Lyrics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఇప్పుడు ఉన్న సినిమా రంగంలో ఐటమ్ సాంగ్స్ వివాదాలు సర్వసాధరణంగా మారాయి. పాట లిరిక్స్ అసభ్యంగా ఉన్నాయని.. లేదా పాటలో హీరో హీరోయిన్ స్టేప్పులు చూడటానికి అభ్యతరకరంగా ఉన్నాయని.. వివాదాలకు దారితీస్తున్నాయి. అయితే త్వరలో విడుదల కాబోయో పెద్ది సినిమాపై కూడా ఇలాంటి వివాదమే చోటుచేసుకుంది.
తాజాగా రామ్ చరణ్ నటించిన ఒక సినిమాలోని ఓ పాట విషయంలో నార్త్ ఇండియాలో కొంత వివాదం చెలరేగింది. దీనిపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ నటించిన సినిమాలోని ‘హెల్లల్లో’సాంగ్‌లోని స్టెప్పులు అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నార్త్ ఇండియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై మూవీ ప్రమోషన్ల కార్యక్రమంలో రామ్ చరణ్ స్పష్టతనిచ్చారు. ఎన్టీఆర్‌తో ‘నాటు నాటు’ సాంగ్‌ను ఎలాగైతే ఆస్వాదిస్తూ డాన్స్ చేశానో, ఈ సినిమాలో శృతిహాసన్ , జానుతో కూడా అలాగే డాన్స్ చేశానని తెలిపారు.
ఈ రెండు పాటలను తాను వేరుగా చూడటం లేదని, ఎవరినైనా అభ్యంతరకరంగా చూపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. కళను ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా తమకు ఇబ్బంది లేదని రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
CLICK HERE TO READ MORE : Peddi Movie Trend | రామ్‌చరణ్ ఫ్యాన్స్‌లో క్రేజ్ మామూలుగా లేదు!
