Formers | పారదర్శక పంపిణి..

Formers | పారదర్శక పంపిణి..
Formers, మహబూబాబాద్, ఆంధ్రప్రభ : యాసంగి సాగు చేసుకుంటున్న రైతులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా యూరియా పంపిణీ పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. మంగళవారం గూడూరు మండల కేంద్రంలోని లక్ష్మీ గణేష్ పట్టిలేజర్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి సాగు చేస్తున్న రైతులందరికీ పంట నమోదు సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం ద్వారా రైతులకు ఎరువులు అందించడం జరుగుతుందని తద్వారా ఎరువుల కొరతను నియంత్రించడం జరుగుతుందని అన్నారు. ఎరువుల షాప్ డీలర్లు విధిగా రికార్డుల మెయిటైన్ చేయాలని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలు జారీ చేశారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు కలిగితే నేరుగా వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.
