ఘనంగా పౌర్ణమి వేడుకలు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పార్వతీ పరమేశ్వర అమ్మవార్లకు 33 రకాల ఫలాలు, పుష్పాలతో కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు.
అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు శ్రీ పార్వతి అమ్మవారికి వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, ఆభరణాలు సమర్పించారు. ఆలయ పూజారి ముదిగొండ అభిషేక శర్మ ఆధ్వర్యంలో పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శివనగర్‌లోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ అన్నప్రసాద వితరణను అమెరికా వాస్తవ్యులు వరదా వెంకట ముని శ్యామ్, శ్రావ్య దంపతులు నిర్వహించినట్లు ఆలయ మహిళా మండలి ప్రతినిధి వడ్నాల పద్మశ్రీ సదానందం తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన భక్తులు, మహిళా భక్తులు, పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు, భవన సమితి కార్యవర్గ సభ్యులు, సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
