కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సంగెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు.
మీడియాతో మాట్లాడుతూ ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం..
- 6వ తరగతిలో – 40 సీట్లు
- ఇంటర్ మొదటి సంవత్సరం ఎంఫీహెచ్‌డబ్ల్యూ కోర్సులో – 40 సీట్లు
- సీఈసీ గ్రూపులో – 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కేజీబీవీలను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని సౌకర్యాలతో కూడిన ఉత్తమ విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
2025–26 విద్యాసంవత్సరంలో విద్యాలయం విశిష్ట ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. పదో తరగతిలో 100 శాతం, ఇంటర్‌లో 96 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందినట్లు వెల్లడించారు.
విద్యార్థినులకు అందించే సౌకర్యాలు
- పూర్తిగా ఉచిత విద్య
- అనుభవజ్ఞులైన ఉపాధ్యాయినులచే బోధన
- ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్
- ఉచిత వసతి, భోజన సదుపాయం
- పరిశుభ్రమైన హాస్టల్ వాతావరణం
- ప్రత్యేక అధ్యయన సమయాలు
- డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ బోధన
- కంప్యూటర్ విద్య, సైన్స్ ల్యాబ్ సదుపాయాలు
- క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు
- ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు
- విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక పర్యవేక్షణ
- కెరీర్ గైడెన్స్, పోటీ పరీక్షల శిక్షణ
ఇంటర్ ఎంఫీహెచ్‌డబ్ల్యూ కోర్సులో చేరే విద్యార్థినులకు వైద్యరంగానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన, ఆరోగ్య సేవలపై శిక్షణ అందిస్తామని తెలిపారు. అలాగే సీఈసీ గ్రూపులో కామర్స్, పోటీ పరీక్షలకు అనుకూలంగా ప్రత్యేక బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకుని అర్హత గల విద్యార్థినులను వెంటనే కేజీబీవీలో చేర్పించాలని స్పెషల్ ఆఫీసర్ కోరారు.
