రికార్డు స్థాయిలో రాప్తాడు–ధర్మవరం నియోజకవర్గాలు టాప్ ర్యాంకుల్లో

రికార్డు స్థాయిలో రాప్తాడు–ధర్మవరం నియోజకవర్గాలు టాప్ ర్యాంకుల్లో

రాప్తాడు, ఆంధ్రప్రభ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వర్చువల్ మహానాడులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ సత్తా చాటారు.

క్లస్టర్‌ల వారీగా జరిగిన భారీ హాజరులో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలు రాయలసీమలోనే టాప్ స్థానాల్లో నిలిచాయి. రాప్తాడు రాష్ట్రస్థాయిలో 5వ స్థానాన్ని సాధించగా, రామగిరి 10వ క్లస్టర్ 7వ స్థానంలో నిలవడం విశేషం. ధర్మవరం నియోజకవర్గం కూడా రెండు రోజుల్లో వేలాది మంది కార్యకర్తల హాజరుతో 8వ స్థానాన్ని దక్కించుకుంది.

ఈ వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మహానాడు వేదికగా మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రెండు నియోజకవర్గాలు అగ్రస్థానాల్లో నిలవడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు.

దాదాపు పది రోజులుగా మహానాడు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, ప్రతి కార్యకర్త, నాయకుడి కృషితోనే ఈ విజయమని వారు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలను మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

మహానాడు అనంతరం అనంతపురంలోని నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీతకు కుటుంబ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.



Leave a Reply