సనాతన ధర్మాన్ని ముందుతరాలకు తెలియజేయాలి

సనాతన ధర్మాన్ని ముందుతరాలకు తెలియజేయాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: సనాతన ధర్మం గురించి ముందుతరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇస్కాన్ టెంపుల్ హిందూ ధర్మకర్త పరమానంద దాస్ అన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపట్టి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ తిరుమలనాథ దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో మాట్లాడారు.
హిందూ ధర్మం, ఆలయాల ప్రాముఖ్యత గురించి పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పరమానంద దాస్ పేర్కొన్నారు. సనాతన ధర్మ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు భగవద్గీతను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శివప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, మర్రి హరీష్ రెడ్డి, ఎరుపుల నరసింహ, ఎరుపుల వెంకన్న, దేవాలయ అర్చకులు అమరేష్, భక్తులు పాల్గొన్నారు.
