మహానాడు కోలాహలంలో టీడీపీ శ్రేణులు

మహానాడు కోలాహలంలో టీడీపీ శ్రేణులు

పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక 60, 61వ డివిజన్లలో మహానాడు కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. వాంభే కాలనీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు వేదిక నుంచి ప్రసారమైన వీడియో సందేశాన్ని శ్రద్ధగా వీక్షించారు.

అనంతరం మహిళా శ్రేణులు ఉత్సాహంగా మహానాడును ఆస్వాదించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ యువ నాయకుడు బొండా సిద్దార్థ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంచి దుర్గా, టీడీపీ క్లస్టర్ ఇంచార్జీలు కంచి ధనశేఖర్, దాసరి కనకరావు, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, బేవర సూర్య, దాసరి దుర్గారావు, ఉమ్మడి వెంకట్రావు, అమ్మరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply