అమ్మ సన్నిధిలో కొనసాగుతున్న సేవా కార్యక్రమం

అమ్మ సన్నిధిలో కొనసాగుతున్న సేవా కార్యక్రమం

భవానిపురం, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో అమ్మ భక్తులకు సేవా కార్యక్రమం కొనసాగుతోంది. కెనాల్ రోడ్ దర్గా వద్ద ఐదో రోజు గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనసేన నాయకులు పాల్గొని భక్తులు, పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాడిత శంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. తమ వంతుగా సేవ చేయడం సంతృప్తినిచ్చిందని అభిప్రాయపడ్డారు. ఎండల తీవ్రత దృష్ట్యా మరో నెలరోజుల పాటు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు నిర్వాహకులు చెప్పడం అభినందనీయమని తెలిపారు.

రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మ దర్శనార్థం వచ్చే భక్తులు ఈ మజ్జిగ పంపిణీ సేవలను సద్వినియోగం చేసుకుంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.