పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి–పల్లా భేటీ

పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి–పల్లా భేటీ

నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై విస్తృత చర్చ

తిరువూరు, ఆంధ్రప్రభ : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేత షరీఫ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ భేటీలో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరాన్ని నాయకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, రాబోయే రాజకీయ కార్యాచరణపై నాయకులు పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.