పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ ; పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో, చైర్మన్ నెట్టెం రఘురాం ఆదేశాల మేరకు మజిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని మజిగ పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా నిలిచింది.

ఈ సేవా కార్యక్రమం ద్వారా కేడీసీసీ బ్యాంకు తమ సామాజిక బాధ్యతను మరొకసారి చాటుకుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని అవసరమైన చోటా చైర్మన్ ఆదేశాల ప్రకారం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్లు, తిరుపతమ్మ తల్లి దేవస్థానం ప్రతినిధులు, పిఎసిఎస్ సీఈఓలు, బ్యాంకు అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.