డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన మానవ హక్కుల సంఘం నాయకులు
డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన మానవ హక్కుల సంఘం నాయకులు
- మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వినతి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌ను అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పాలకుర్తి విజయ్ కుమార్, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర డీజీపీని కలిసి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. పోక్సో చట్టాలు, మహిళా రక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేసి మహిళలకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు.
అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వినతిపత్రం రూపంలో డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. వారి వినతిపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్లు నాయకులు వెల్లడించారు.
