నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ

-విలేజ్ పోలీస్ వ్యవస్థ బలోపేతంపై ఎస్పీ ఆదేశాలు

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు అంశాలను సమీక్షించారు. క్రైమ్ ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరాల పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి త్వరితగతిన సేవలు అందేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామ స్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు.

దొంగతనాలు, చోరీలు, ఇతర ఆస్తి నేరాల నివారణకు రాత్రి, పగలు గస్తీ పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. హైవేలు, గ్రామ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి రౌడీషీటర్లు, అనుమానితులను తరచుగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలో జిల్లా ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, 2టౌన్ సీఐ రాఘవ రావు, రూరల్ ఎస్ఐ సైదా బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply