politics | కర్ణాటకలో ఎమ్మెల్యేగానే కొనసాగుతా…

politics | కర్ణాటకలో ఎమ్మెల్యేగానే కొనసాగుతా…

politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా కొనసాగుతానని తెలిపారు.

గవర్నర్ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ బెంగళూరులో అందుబాటులో లేకపోవడంతో తన రాజీనామా లేఖను లోక్‌భవన్‌లో కార్యదర్శికి అందజేసినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. అధిష్ఠానం సూచనల మేరకే సీఎం పదవికి రాజీనామా చేశానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

“తన రాజకీయ ఆదర్శాల విషయంలో ఎప్పుడూ రాజీ పడను. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదు. రాజ్యసభకు వెళ్లాలని అధిష్ఠానం కోరినా.. నేను వెళ్లబోనని చెప్పాను” అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తన రాజీనామాను గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఆమోదిస్తారనే విశ్వాసం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply