పామర్రులో బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొనటం..

పామర్రులో బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొనటం..
పామర్రు, ఆంధ్రప్రభ: పామర్రు టౌన్ గఫార్ సెంటర్ చిన్న మసీదులో ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అల్లాహ్ దయతో ప్రతి ఇంటా సంతోషం, ఆయురారోగ్యాలు నిండాలని, సమాజంలో శాంతి, సోదరభావం ఎల్లప్పుడూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
