రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద ప్రమాదం

పామర్రు, ఆంధ్రప్రభ: మచిలీపట్నం–విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపై బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న సీఐ నాకా ప్రసాద్, ఎస్సై కె. శ్రీనివాసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మృతుడు బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అని, అతను పెడనకు చెందినవాడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply