పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి
పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి
అచ్చంపేట, ఆంధ్రప్రభ:
బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడి రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
బల్మూర్ మండలంలోని కొండనాగుల గ్రామానికి చెందిన గాజుల చిన్న కోటయ్య (ఎర్రన్న కుమారుడు)కు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పశువుల మృతితో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. ఘటనపై స్థానిక అధికారులు పరిశీలించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
