కామారెడ్డి గూడలో అధ్వానంగా ఉన్న రోడ్డు

కామారెడ్డి గూడలో అధ్వానంగా ఉన్న రోడ్డు
80 లక్షల రూపాయలతో 18 నెలల కిందట శంకుస్థాపన చేశారు నేటికి పూర్తి కానీ వైనం .ఆవేదన వ్యక్తం చేసిన సర్పంచ్ శంకరమ్మ ఉపసర్పంచ్ శివరాజ్ గౌడ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండలం కామారెడ్డి గూడ గ్రామానికి 80 లక్షల రూపాయలతో రోడ్డు పనుల కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 18 నెల కిందట శంకుస్థాపన చేసినప్పటికీ నేటికి పూర్తి కాకపోవడంతో ప్రజలు వాహనదారులు గ్రామస్తులు ఇబ్బందుల పాలు అవుతున్నారు మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై నీరు నిలిచిరాకపోకలకు అంతరాయం కలిగింది గ్రామ సమీపంలో గుంతలు పడ్డ చోట మట్టి పోసినప్పటికీ భారీ వర్షం కారణంగా నీరు నిలిచి ప్రజలు నడవని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికార యంత్రాంగం కాంట్రాక్టర్ ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ శంకరమ్మ ఉపసర్పంచ్ శివరాజ్ గౌడ్ కోరారు.
