చింతకుంట రామయ్యపల్లిలో పంచాయతీ భవనం ప్రారంభం

చింతకుంట రామయ్యపల్లిలో పంచాయతీ భవనం ప్రారంభం

చిట్యాల, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయాలు ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పాలకవర్గ సమావేశాలు నిర్వహించేందుకు నూతన భవనం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

గ్రామాభివృద్ధిలో పంచాయతీల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మటిక సుజాత రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ, తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీవో జయశ్రీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ, నాయకులు గోపగాని కొమురయ్య, బొజ్జం వేణు, పర్లపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.