శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధుల సహకారం అవసరం

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధుల సహకారం అవసరం

  • ఎస్సై మహేందర్ రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని తొర్రూరు ఎస్సై తోట మహేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల సర్పంచులు మంగళవారం డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సై మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని, దానికి దాతల సహకారం తీసుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు, ఘటనల ఛేదనకు దోహదపడతాయని తెలిపారు. గ్రామాల్లో వాహనదారులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం లేదా సరఫరా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

పంట అవశేషాలను కాల్చకుండా రైతులకు అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ఇటీవల మండలంలో పంట అవశేషాల దహనం వల్ల పర్యావరణానికి, తోటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు కొమురవెల్లి లింగమూర్తి, నలుగురి రామలింగం, చిదిరాల కృష్ణమూర్తి, బానోతు బిక్షపతి, బానోతు శ్రీను, బంగారు రమేష్, జాటోతు రామ్‌లాల్, ఇట్టే మాధవ రెడ్డి, ధర్మారపు మహేందర్, మాలోతు మౌనిక సంతోష్, జాటోతు భోజు, యనమల సావిత్రి శ్రీనివాస్, రాగి సంగీత జగదీశ్వర చారి, బాదావత్ విజయ లింబ, బానోతు విద్యాసాగర్, ఎండి మహబూబ్ పాష, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ పాల్గొన్నారు.