కనెక్ట్ ఏపీ ఎక్స్‌పో భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం

కనెక్ట్ ఏపీ ఎక్స్‌పో భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం

విజయవాడ కేంద్రంగా కొత్త ఆవిష్కరణలు చూడటం ఆనందదాయకం – ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజ‌య‌వాడ‌ బ్యూరో, ఆంధ్రప్రభ : భవిష్యత్ తరాలకు కనెక్ట్ ఏపీ లాంటి ఎక్స్‌పో కార్యక్రమాలు ఎంతో అవసరమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బీపేటలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్‌పో కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ బండారు కృష్ణ ఆధ్వర్యంలో విజయవాడలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్లు, ఓటీపీ, డీటీపీ, ఇంటర్నెట్, డ్రోన్లు తదితర హార్డ్వేర్ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం మంచి అవకాశమని అన్నారు.

భవిష్యత్‌లో టెక్నాలజీ ఆధారిత ప్రపంచమే ఉండబోతుందని, అందుకు అనుగుణంగా కేబుల్ ఆపరేటర్లు సహా అన్ని రంగాలు అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇలాంటి ఎక్స్‌పోల ద్వారా కొత్త టెక్నాలజీలపై అవగాహన పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.

విజయవాడ వంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో మరిన్ని ఇలాంటి ఎక్స్‌పోలు నిర్వహించే అవకాశం ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక బృందాన్ని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటు కనెక్ట్ ఏపీ ఎక్స్‌పో ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply