ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివే.. రాష్ట్ర ప్రభుత్వానిది మధ్యవర్తి పాత్ర
.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ ఆంధ్రప్రభ
రైతులు కష్టించి పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రం డబ్బులతోనే కొనుగోలు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండిసంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ భవనంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో సుతిలీ తాడు నుండి మొదలు రవాణా ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమే అని స్పష్టం చేశారు.
మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందని, అయినా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమవుతోందన్నారు.
ఇకనైనా బేషజాలకు పోకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేయండిని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలన్నారు.
పొరపాట్లు జరిగిన చోట గుర్తించి వెంటనే సరి చేసుకుని వడ్లను కొనుగోలు చేయాలన్నారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చేందుకు బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా పేరుతో యాత్రలు చేస్తున్నామన్నారు.
