Chief Minister | ఏడుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
Chief Minister | ఏడుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
Chief Minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో సంచలనం రేపిన చంద్రనాథ్ రథ్ హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి పీఏగా పనిచేసిన చంద్రనాథ్ రథ్ హత్య కేసుపై వస్తున్న ఆరోపణలు, అనుమానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి బదిలీ చేసింది.
దర్యాప్తు ప్రక్రియను సమన్వయం చేసేందుకు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేసులోని అన్ని కోణాలను పరిశీలించి త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
