అమెరికాపై త‌గ్గుతున్న ఆస‌క్తి

అమెరికాపై త‌గ్గుతున్న ఆస‌క్తి

ఆంధ్ర‌ప్ర‌భ ఇంట‌ర్నేష‌న‌ల్ డెస్క్ : ఒక‌ప్పుడు అమెరికాకు సంప‌న్నవిద్యార్థుల మాత్ర‌మే వెళ్లేవారు. రానురాను విద్యార్థుల‌(students)కు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇవ్వ‌డం.. అమెరికాలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు దొర‌కడం.. ఇలా ఎన్నో సౌక‌ర్యాల‌ను వినియోగించుకుంటూ భార‌త దేశం నుంచి అమెరికాకు ఉన్న‌త విద్యా నిమిత్తం ఎంద‌రో మ‌ధ్య‌, పేద త‌ర‌గ‌తి విద్యార్థులు వెళ్లేవారు. అమెరికా అధ్య‌క్షుడుగా రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకు వ‌చ్చిన ఇంటర్నెట్ మాస్ డిపోర్టేషన్(Mass Deportation), అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో ఆ దేశం వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు.

వలసదారులపై అమెరికా అధ్య‌క్షుడు(US President) విరుచుకుపడుతున్నతీరు చూసిన భార‌తీయ విద్యార్థులు అక్క‌డికి వెళ్లి చిక్కులు ప‌డ‌తామేమో అని భ‌య‌ప‌డుతున్నారు. దీంతో ఆ దేశానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఆగస్టులో ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది.

ట్రంప్ చర్యల నేపథ్యంలో ఆగస్టులో విదేశీ విద్యార్థులకు జారీచేసే వీసా(Visa)ల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19 శాతం తగ్గింద‌ని స‌మాచారం. ఇక భారతీయ విద్యార్థుల విషయానికొస్తే 44 శాతం త‌గ్గుద‌ల క‌నిపించింది.

అమెరికాలో సంప‌న్నుల కుటుంబాల‌కు చెందిన పిల్ల‌లు మాత్ర‌మే చ‌దువుకునేవారు. ఇండియాలో సాఫ్ట్‌వేర్ రంగం(Software Industry) అభివృద్ధి చెందిన త‌ర్వాత‌ ఇక్క‌డ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు ఏర్పాట‌య్యాయి. అందులో ప‌నిచేసే ఉద్యోగులు డిప్యూటేష‌న్‌పై విదేశాలు వెళ్ల‌డం, త‌ద్వార వారు ఇక్క‌డ ఉన్న విద్యార్థుల‌కు చైత‌న్య ప‌ర‌చ‌డంతో అమెరికా చ‌దువుల‌పై భార‌తీయుల‌కు ఆస‌క్తి పెరిగింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh)లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అమ‌లు జ‌రిగిన త‌ర్వాత‌ ఇంజినీరింగ్ చ‌దువుకునే వారు అధిక‌మ‌య్యారు.

మిగిలిన రాష్ట్రాల్లో ఇంజ‌నీరింగ్ చ‌దువులు కూడా పేద‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. దీంతో ఇంజ‌నీరింగ్ గ్రాడ్యూట్(Engineering Graduate) చేసేవారు అధిక‌మ‌య్యారు. భార‌త దేశంలో ఇంజ‌నీరింగ్ గ్రాడ్యూట్ చేసే వారంద‌రికీ ఉద్యోగాలు దొర‌క్క‌పోవడంతో విదేశాల వైపు చూడటం ప్రారంభ‌మైంది. బ్యాంకులు కూడా విదేశీ చ‌దువుల‌కు రుణాలు ఇవ్వ‌డం ప్రారంభించాయి. అమెరికాలో చ‌దివిన ఎంఎస్‌, ఎంబీఏ కోర్సుల‌కు ప్ర‌పంచ మొత్తం మీద ప్రాధాన్య‌త ఉండేది.

దీంతో ఇంజినీరింగ్ చేసిన త‌ర్వాత ఎంఎస్‌, ఎంబీఏ కోసం అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరిగింది. అక్క‌డే చ‌దువుకుని తొలుత పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుని హెచ్‌1బీ వీసా(H1B Visa) సంపాదించి స్థిర‌ప‌డిన‌వారు కూడా ఉన్నారు. అమెరికాలో ఒక డాల‌ర్ విలువ ఇండియా క‌రెన్సీలో 88.76 రూపాయ‌లు ఉంటుంది. దీంతో అమెరికాలో ఒక‌వైపు ఎంఎస్ చ‌దువుకుంటూ మ‌రోవైపు అక్క‌డ ఉన్న చిన్నిచిన్న వ్యాపారాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలుగా చేసుకుంటూ ఆదాయం సంపాదించుకుంటున్నారు.

అమెరికాలో నెల‌కు వెయ్యి డాల‌ర్లు పార్ట్ టైమ్ ఉద్యోగుల‌కు వేత‌నంగా ఇస్తే అది ఇండియా క‌రెన్సీ ప్ర‌కారం 88,700 రూపాయ‌లు అవుతుంది. అక్క‌డ ఖ‌ర్ఛులు పో్నూ ప్ర‌తి విద్యార్థికి సుమారు 40000 రూపాయ‌లు మిగిలుగుతుంది. దీన్ని ఈఎంఐగా క‌డితే మూడు, నాలుగేళ్ల‌లో విద్యార్థుల‌కు ఇచ్చే బ్యాంకు లోను తీరుపోతుంది. ఇలాంటి ఎన్నో సౌక‌ర్యాల‌తో అమెరికాకు భార‌తీయులు అధికంగా ప‌రుగులు తీసేవారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సంస్కరణలు భారతీయ విద్యార్ధులపై ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగును తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా(Social Media) వెట్టింగ్ కోసం వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించిన సంగ‌తి తెలిసిందే.

వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అదికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే ‘సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్ల(Profiles)ను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అయితే తర్వాత వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల(Indian Students)పై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

Leave a Reply