భారీ గాలి వాన బీభత్సం..
భారీ గాలి వాన బీభత్సం..
- పలుచోట్ల ఇరిగిపడ్డ చెట్లు..తడిసిన ధాన్యం..
- విద్యుత్ సరఫరా అంతరాయం..
- ఓ ఫంక్షన్ హాల్ ధ్వంసంతో
- రూ.60 లక్షల నష్టం..
జన్నారం, ఆంధ్రప్రభ : భారీ అకాల గాలివాన మంగళవారం సాయంత్రం జన్నారం మండలంలో బీభత్సం సృష్టించింది. ఓ గంట పాటు భారీ ఈదురు గాలులతో అకాల వర్షం కురియడంతో పలుచోట్ల రోడ్డుకు అడ్డంగా,విద్యుత్ స్తంభాలపై పెద్ద చెట్లు విరిగిపడ్డాయి.దీంతో విద్యుత్ సరఫరకు తీవ్ర అంతరాయం కలిగింది.మండలంలోని పొనకల్ సమీపాన ఉన్న ఎస్.కె ఫంక్షన్ హాల్ ధ్వంసం అయ్యింది.దీంతో రూ. 60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆ ఫంక్షన్ హాల్ యజమాని ఎస్కే బాషారత్ తెలిపారు.

మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో పెద్దపెద్ద చెట్లు విద్యుత్ స్తంభాలపై,రోడ్డుకు అడ్డంగా పడి అంతరాయం ఏర్పడింది.కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు,మక్కలు వర్షానికి నానాయి.దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.ముఖ్యంగా రైతులు పడరాని పాట్లు పడ్డారు.విద్యుత్ శాఖ,పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమై చెట్లను నరికి వేయిస్తూ తొలగిస్తున్నారు.పలు గ్రామాలలో యువకులు ముందుకు వచ్చి రోడ్డుకు అడ్డంగా, విద్యుత్ స్తంభాలపై పడ్డా చెట్లను నలుగుతూ తొలగిస్తున్నారు.

