వడదెబ్బతో మహిళ మృతి..

దమ్మపేట, ఆంధ్రప్రభ : వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన దమ్మపేట మండల పరిధిలోని చలమప్పగూడెం లో సోమవారం జరిగింది .ఈ సంఘటనకు సంబంధించి దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చలమప్పగూడెం గ్రామానికి చెందిన బండారు నాగమణి (40) గత మూడు రోజుల క్రితం పామాయిల్ తోట కాలిపోగా తన భర్తతో కలసి తోటలోకి వెళ్లి నీళ్లు పెట్టి వస్తున్నారు . ఈ క్రమంలో నీళ్లు పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే వడదెబ్బకు కండ్లు తిరిగి వాంతులు అయ్యి అస్వస్థతకు గురైంది .దీంతో సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది .మృతురాలి భర్త కొర్రాజులు ఫిర్యాదు మేరకు దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
