తూకం ఆలస్యంతో రైతుల నిరసన.. జాతీయ రహదారిపై ఆందోళన

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మొక్కజొన్న రైతులు బైంసా నిజామాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ఆందోళన చేపట్టారు. మొక్కజొన్న పంట తీసుకువచ్చి మూడు రోజులు అవుతున్న ట్రాక్టర్ల నుండి పంటను తూకం వేయకుండా ట్రాక్టర్ ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం అధికారులు స్పందించి పంటను తూకం వేసి కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడు రోజులుగా మొక్క జొన్న పంట తీసుకవచ్చిన పంట తూకం వేయకుండా తెచ్చిన ట్రాక్టర్ల లోని పంటను అలాగే ఉంచి తమను ఇబ్బందులకు గురి చేయడం సభవేనా అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు స్పందించి పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.స్పందించిన అధికారులు తూకం వేసి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రైతుల ఆందోళనతో గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.