పాత స్నేహానికి నిలువెత్తు నిదర్శనం..!

పాత స్నేహానికి నిలువెత్తు నిదర్శనం..!

పాయకాపురం, ఆంధ్రప్రభ : తెలుగు సినీ దర్శకరత్న దాసరి నారాయణరావుకు సన్నిహిత మిత్రుడైన శనగశెట్టి సుబ్బారావుకు బుద్దా వెంకన్న మిత్ర బృందం రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేసింది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బావాజీపేటలో నివాసం ఉంటున్న శనగశెట్టి సుబ్బారావు, రాధా రంగా మిత్ర మండలి సభ్యుడిగా గుర్తింపు పొందారు. సినీ దర్శకరత్న దాసరి నారాయణరావుకు సన్నిహిత మిత్రుడిగా కూడా ఆయనకు పరిచయం ఉంది.

నరాలకు సంబంధించిన వ్యాధితో పక్షవాతం రావడంతో సుబ్బారావు ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. ఆయన ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న బుద్దా వెంకన్న స్పందించి, తన మిత్ర బృందం ఆధ్వర్యంలో రూ.25 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.

సుబ్బారావు నివాసానికి వెళ్లిన బుద్దా వెంకన్న మిత్ర బృంద సభ్యులు కళ్ళే నాగేశ్వరరావు, రాజనాల మాణిక్యాలరావు, కొప్పుల వెంకట్, చందన సురేష్ (మామ), యాసం చిట్టిబాబు సోమవారం ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగదును అందజేశారు.

సుబ్బారావు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మిత్రులు ధైర్యం చెప్పారు.

Leave a Reply