ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ఇబ్రహీంపట్నం, నవంబర్ 5 (ఆంధ్రప్రభ): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు మెరుపు దాడులు చేశారు.

కార్యాలయంలోకి ఎవరిని లోపలికి రానివ్వకుండా, లోపలి ఉన్న వారు బయటకు రాకుండా గేట్లు మూసివేశారు. రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారిని విచారించారు. రికార్డులు తనిఖీ (Check records) చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. తమ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.

Leave a Reply