అప్పన్నవీడులో ప్రత్యేక దర్శనం వెనుక సందడి ఏంటి..?

అప్పన్నవీడులో ప్రత్యేక దర్శనం వెనుక సందడి ఏంటి..?
ఏలూరు, ఆంధ్రప్రభ : గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు అప్పన్నవీడు (హనుమాన్ జంక్షన్)లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి నియోజకవర్గానికి ఘన స్వాగతం పలికారు.
శ్రీ అభయాంజనేయ స్వామివారికి పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
