మాజీ మంత్రి హరీష్‌రావును కలిసిన ఎమ్మెల్యేలు…

మాజీ మంత్రి హరీష్‌రావును కలిసిన ఎమ్మెల్యేలు…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్చిష్మాన్ ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీలో హరీష్ రావు కొడుకు ఎంబీఏ పూర్తి చేసిన సందర్భంగా హరీష్‌కు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
