భాగ్యరెడ్డి వర్మ ఆశయాలు ఆదర్శం

భాగ్యరెడ్డి వర్మ ఆశయాలు ఆదర్శం

  • జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సామాజిక సమానత్వం, అందరికీ విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సమానత్వ భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply